Aug 25,2023 21:58

మాట్లాడుతున్న నక్కా రాధయ్య

మాట్లాడుతున్న నక్కా రాధయ్య
27న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి
ప్రజాశక్తి-ముత్తుకూరు:ఈనెల 27న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వ్య.కాస జిల్లా ఉపాధ్యక్షులు నక్కా రాధయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక శ్రామిక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ముత్తుకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు బ్రహ్మ దేవి సెంటర్లో జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు తరలివస్తారన్నారు. ఉపాధి హామీ చట్టంపై చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోవు రోజుల్లో వ్యవసాయ కార్మికులందరినీ ఐక్యం చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ కూలీలపై ఉందన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఆసాది మల్లమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దుంపల ఏడు కొండలు, మండల నాయకులు పెద్దపూడి వెంకయ్య, ఎస్‌కె సలాం, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.