Aug 21,2023 00:26

27న చలో గాజువాక


ప్రజాశక్తి రావికమతం: ఈనెల 27న చలో గాజువాక సభను విజయవంతం చేయాలని చేనేత సంఘం జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద్‌ ప్రసాద్‌ కోరారు. మండల కేంద్రంలో మండలం చేనేత కార్మిక సంఘం కార్యదర్శి ఉప్పు బాబ్జి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 సంవత్సరముల నిండిన చేనేత కార్మికులందరికీ పెన్షన్‌ సౌకర్యం కల్పించారన్నారు. నాలుగేళ్ల నుంచి 50 సంవత్సరములు పైబడిన చేనేత కార్మికులకు ఏ ఒక్కరికి పెన్షన్‌ సౌకర్యం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారుజ ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాజారావు, జిల్లా చేనేత సంఘ అధ్యక్షుడు మాడెం సూరిబాబు, రాష్ట్ర చేనేత సంఘం డైరెక్టర్‌ పప్పు రమణ, జిల్లా చేనేత సంఘం డైరెక్టర్‌ దొడ్డి సురేష్‌, మండల చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి యు బాబ్జి పాల్గొన్నారు.
నక్కపల్లి:్ట 27న చలో గాజువాకను చేనేత కార్మికులు విజయవంతం చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నక్కపల్లిలో సమావేశం నిర్వహించారు. ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు, జిల్లా అధ్యక్షులు మాడెం సూర్య అప్పారావు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కల్లూరి బాబ్జి , జాగు కొండబాబు, తెడ్లకు బాల, చంటి, మహేష్‌ మాడెం సూరిబాబు, వరహాలు, కల్లూరి సత్తిబాబు, మహేష్‌ , గుద్దటి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.