Aug 14,2023 18:40

సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

సచివాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు
26వ డివిజన్‌ ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి-నెల్లూరు:నగర 26వ డివిజన్‌ శాఖ ఆధ్వర్యంలో డివిజన్‌ సచివాలయాలు ఒకటి ,రెండు, మూడు వద్ద స్థానిక సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం సచివాలయం అధికారికి అర్జీ సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) రూరల్‌ కార్యదర్శి బత్తల కష్ణయ్య మాట్లాడుతూ ఈనెల 2 నుంచి ఏడో తేదీ వరకు సిపిఎం రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో రూరల్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో ''ప్రజాపోరు యాత్ర'' నిర్వహించామన్నారు.
ఆ సందర్భంగా ప్రతి డివిజన్‌లోని సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ కమిటీ సభ్యులు దేవతాటి. సంపత్‌ కుమార్‌, సీనియర్‌ నాయకులు పులిమి నరసింహారెడ్డి, సభ్యులు బి. శేషయ్య, రాదయ్య, ప్రవీణ్‌ బాబు, సిహెచ్‌. కష్ణ, శంకర్‌, వెంకటేశ్వర్లు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.