Dec 29,2022 23:43
రుద్రరాజుకు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు

ప్రజాశక్తి -పాయకరావుపేట:రాహూల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జనవరి 26తో ముగుస్తున్నందున దీనికి కోనసాగింపుగా హత్‌ సే హత్‌ జోడో అబియాన్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలలో పాదయాత్రుల చేపడతామని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు.ఉత్తరాంద్ర ఉమ్మడి జిల్లాల పర్యటనలను విజయవంతంగా ముగించుకుని పాయకరావుపేట మీదుగా వెళ్ళుతున్న ˜్‌ రుద్రరాజు బృందానికి స్థానిక వైజంక్షన్‌లో నియోజక వర్గ ఇన్‌ చార్జ్‌ తాళ్ళూరి విజరు కుమార్‌, కో ఆర్డినేటర్‌ జగతా శ్రీనివాస్‌ల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట కాంగ్రెస్‌ కో ఆర్డినేషన్‌ మెంబర్‌ రుత్తల శ్రీరామ్ముర్తి, ఏపి ప్రధాన కార్యదర్శి బోడ్డు శ్రీనివాసులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దగ్గుపల్లి బాలరాజు, నక్కపల్లి మండలం అద్యక్షుడు ప్రగడ చక్రి, నాయకుడు అప్పలరాజు, గారా పావని, అర్జున్‌, జి సాయి వినరు, గణేష్‌ పాల్గోన్నారు.