
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న విజయసారధి తదితరులు
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : గురజాల పట్టణంలోని చల్లగుండ్ల గార్డెన్స్‌లో ఈనెల 26వ తేదీన నిర్వహించే యుటిఎఫ్ పల్నాడు జిల్లా మహాసభను జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి కోరారు. ఈ మేరకు పోస్టర్‌ను పిడుగురాళ్లలోని యుటిఎఫ్ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. మహాసభకు యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, పిడిఎఫ్ ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు హాజరవుతారని, ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు, వాటి పరిణామాలపై మాట్లాడ్డంతోపాటు పలు సమస్యలకు పరిష్కారాలను సూచిస్తారని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి, ఉపాధ్యాయుల కర్తవ్యాలను నిర్దేశిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి యుటిఎఫ్ శ్రేణులు, ఉపాధ్యాయులు వేలాదిగా తరలిరావాలని కోరారు.