
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు. సెప్టెంబరు 30 నుంచి నవంబర్ 1 వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 474, పట్టణ ప్రాంతాల్లో 30 సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించి 2.60 లక్షల మందికి మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారని తలెఇపారు. రక్తపోటుకు సంబంధించి 90,478, మధుమేహం 80,301, మందికి, మలేరియాకు సంబంధించి 1464 మందికి , డెంగీ పరీక్షలు 1493 మందికి జరిపినట్లు తెలిపారు. మూత్ర పరీక్షలు 3,796 మందికి, ఈ.సి జి 47,457 , హెచ్ బి 69,159 మందికి, టి బి పరీక్షలు 1143 మందికి జరిపామన్నారు. కంటివెలుగు కింద 4 వేల మందికి రిఫర్ చేశామన్నారు. వైద్యుల సిఫారసు మేరకు 7,764 మందిని తదుపరి చికిత్స కోసం ఆరోగ్యశ్రీ, ఇతర ఆసుపత్రులకు పంపించినట్లు తెలిపారు. ఈ శిబిరాలు ఈనెల 14 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరుగు తాయని, జిల్లా ప్రజానీకం తమ సమీపంలో జరిగే ఈ శిబిరాలకు హాజరై తమ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.