Dec 19,2022 21:15

సమావేశంలో మాట్లాడుతున్న రోల్‌ అబ్జర్వర్‌ ప్రద్యుమ్న


కడప :ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా - 2023ను ఎలాంటి పెండింగ్‌ లేకుండా సిద్ధం చేయాలని భారత ఎన్నికల కమిషన్‌ రోల్‌ అబ్జర్వర్‌ పి.ఎస్‌. ప్రద్యుమ్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.హొ సోమవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలులో భారత ఎన్నికల కమిషన్‌ రోల్‌ అబ్జర్వర్‌ పి.ఎస్‌. ప్రద్యుమ్న జేసీ సాయికాంత్‌ వర్మ, శిక్షణా కలెక్టర్‌ రాహుల్‌ మీనాతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ అమలుపై జిల్లాలోని అన్ని రాజీకీయ పార్టీల ప్రతినిధులు, ఇఆర్‌ఒలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.హొ ఈ సంద ర్భంగా రోల్‌ అబ్జర్వర్‌ ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా పురోగతిని జిల్లాలో నియోజకవర్గాల వారీగా అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2023వ సంవత్సరం జనవరి 5న తుది ఎన్నికల జాబితా ప్రచురణ నేపథ్యంలో ఈ నెల 26 నాటికి జిల్లా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాను సిద్ధం చేయాలన్నారు. అందుకు సంబంధించిన కార్యాచరణపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, ఎఇ ఆర్‌ఒలకు దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిం చాల న్నారు. జిల్లాల్లో కొత్తగా ఓటు నమోదు కోసం ఫారమ్‌-6, నకిలీ ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వలస పోయిన వారు, మరణించిన వారు, కొత్తగా వివాహం అయ్యి వేరే ఊళ్లకు వెళ్లిన వారు, పునరావతం అయిన పేర్లు వంటి తొలగింపునకు ఫారమ్‌-7, మార్పుల కోసం ఫారమ్‌-8 లను ఉపయోగిస్తూ జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఫారమ్‌-6బి ద్వారా ఓటరు కార్డును ఆధార్‌ కార్డుతో అనుసం ధానం చేయాలన్నారు. అలాగే పోలింగ్‌ స్టేషన్ల మార్పు మొదలైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కొత్తగా ఓటు నమోదుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా 18-19 వయస్సులో ఉన్న వారు, ట్రాన్స్‌ జెండర్లు, నిరాశ్రయుల జాబితాను తయారీలోను ప్రత్యేక దష్టి సారించాలని సంబందిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జేసీ సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విధి విధానాల మేరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నామని, రానున్న ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న నిర్వహణ ఏర్పాట్ల పురోగతిని రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. నిర్దేశిత లక్ధ్యం మేరకు జిల్లాలో అన్ని పనులను పూర్తి చేశామని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్‌ గౌడ్‌, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు ధర్మాచంద్రా రెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంక టేశ్వర్లు, ఎన్నికల నోడల్‌ అధికారి శివారెడ్డి, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలకష్ణ యాదవ్‌ , సతీష్‌ చంద్ర, చంద్ర శేఖర్‌ రెడ్డి, బి. నారాయణ , డా. బి. వర కుమార్‌ , హరిప్రసాద్‌, నీలి శ్రీనివాసరావు కాంగ్రెస్‌, సీపీఐ తదితర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.