Aug 18,2023 23:08

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కాకుమాను నాగేశ్వరరావు

పెదనందిపాడు: ఈ నెల 25న పెదనందిపాడు లో జరిగే నారాయణ విజ్ఞాన కేం ద్రం ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు పిలుపు నిచ్చారు. శుక్రవారం తేళ్ల నారాయణ విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సమస్యల పరిష్కార పోరాటాలకు కేంద్ర బిందువుగా ఈ విజ్ఞాన కేంద్రం ఉంటుందని అన్నారు. 25 న జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు మండల ఉపాధ్యక్షులు దొప్పలపూడి రమేష్‌ బాబు, పి భువనేశ్వరి, విజయలక్ష్మి, మర్రి లక్ష్మి, ఎం షమీ తదితరులు పాల్గొన్నారు.