Dec 18,2022 23:58

కరపత్రాన్ని విడుదల చేస్తున్న నందీశ్వర నాట్యమండలి ప్రతినిధులు

ప్రజాశక్తి-మునగపాక రూరల్‌
రంగస్థల దర్శకులు, ఉపాధ్యాయులు కీర్తిశేషులు సాంబశివరావు మాస్టారు ఏడవ సంస్మరణ సభ ఈనెల 25న ఆదివారం సాయంత్రం నందీశ్వర కళా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు నందీశ్వర నాట్యమండలి, మాస్టారు అభిమానులు తెలియజేశారు. స్థానిక నందీశ్వర కళా ప్రాంగణంలో ఆదివారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్మరణ సభ అనంతరం అదే రోజు రాత్రి 7.30 గంటలకు కరీంనగర్‌ చైతన్య కళాభారతి వారిచే ''చీకటి పువ్వు'' అనే నాటిక ప్రదర్శింపబడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కళాకారులు, కళాభిమానులు, మాస్టారు శిష్య బృందం తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగస్థల దర్శకులు దాడి ముసలి నాయుడు, స్థానిక నాయకులు మళ్ల సంజీవరావు, టెక్కలి కొండలరావు, మళ్ల కృష్ణ, టెక్కలి సూరప్పారావు, సూరిశెట్టి శ్రీను, కేవీపీ సన్యాసి నాయుడు, బూడిద శ్రీను, పూసర్ల సత్యనారాయణ, దొడ్డి వెంకట సూరప్పారావు, బొడ్డేటి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.