కరపత్రాలను ఆవిష్కరిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు
25న జరిగే జాతీయ సదస్సును జయప్రదం చేయండి
- డివైఎఫ్‌ఐ జిల్లా కమిటీ పిలుపు
ప్రజాశక్తి-నెల్లూరు:భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ పరిష్కారం కోసం జరిగే జాతీయ సదస్సున జయప్రదం చేయాలని నగర కమిటీ సమావేశం సందర్భంగా పిలుపునిచ్చింది. మంగళవారం నగరంలోని డివైఎఫ్‌ఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ నగర జిల్లా కార్యదర్శులు నరసింహ రమణ లో మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన విజయవాడలోనే మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే జాతీయ సదస్సును జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ శాతం పెరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకమందు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మెగా డీఎస్సీ విడుదల చేస్తానని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని, స్థానిక పరిశ్రమంలో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని, నిరుద్యోగులకు అనేక వాగ్దానాలు ఇచ్చే తీరా గద్దెనెక్కినాక మాట తప్పారన్నారు. రైల్వే శాఖలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తే అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వాటిని భర్తీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అన్నారు. నిరుద్యోగశాతం రోజురోజుకు పెరిగిపోతుంటే భర్తీ చేయాల్సిన ప్రభుత్వాలు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అప్పగిస్తుందని, తద్వారా నిరుద్యోగులను మోసం చేస్తుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో కారిడార్ ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ జిల్లా వాసులకు ఉపాధి కరువైందని ఆ పరిశ్రమలు పనిచేసే వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పరిశ్రమంలో ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పే భూములు తీసుకున్న ప్రభుత్వం మాట తప్పే ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులుగా ఉన్న యువత ఏమి చేయాలో దిక్కు తోచనే స్థితిలో మత్తు పదార్థాలకు బానిసలై యువత పెడదారిన పడుతున్నారని ఆ మత్తులో అనేక అసాంఘిక చర్యలతో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం , ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం జరిగే ఈ జాతీయ సదస్సులో నగరంలో ఉన్న యువత అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు జగదీష్, మనీ, ఫయాజ్ ,రవి ,సుబ్బరాయుడు, కష్ణ ,కుమార్ తదితరులు పాల్గొన్నారు.










