Feb 26,2023 20:18

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నిర్మాత రమేష్‌

25న 'ఏది ప్రేమ' చిత్రీకరణ ప్రారంభం
నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో షూటింగ్‌
- చిత్ర నిర్మాత రమేష్‌ వెల్లడి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      ఎన్నో ప్రేమకథా చిత్రాలకు విభిన్నంగా స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం 'ఏది ప్రేమ' అనే సినిమా షూటింగ్‌ను మూడు భాషల్లో మార్చి 25న పుర ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో నంద్యాలలో టిఆర్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా క్లాప్‌ కొట్టి ప్రారంభిస్తామని చిత్ర నిర్మాత రమేష్‌ తోడేటి తెలిపారు. ఆదివారం నంద్యాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏది ప్రేమ అనే సినిమా తీసి నిర్మాతల వరుసలో మన ప్రాంత వాసిగా నిలబడాలనేదే తన కోరిక అన్నారు. పెద్ద పెద్ద పట్టణాలకు దీటుగా మన ప్రాంతాన్ని పరిచయం చేస్తూ ఈ ప్రాంత అందాల సోయగాలను సినిమాల్లో చూడాలనేదే మనందరి కోరిక అన్నారు. చిత్ర పరిశ్రమ పెద్దలు మన వైపు చూసే విధంగా ఉమ్మడి కర్నూల్‌ జిల్లాల్లో అనువైన ప్రదేశాలలో, పచ్చటి పొలాలలో, అందమైన కొండలలో, మనసుకు ప్రశాంతత ఇచ్చే నెలవంకల చప్పుళ్ల మధ్య, నల్లమల అటవీ అందాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల నడుమ, కనువిందు చేసే రాజుల కాలం నాటి పురాతనమైన కట్టడాల అందాలను అతి తక్కువ బడ్జెట్‌తో ఏది ప్రేమ ఈ సినిమాన్ని చిత్రీకరిస్తామన్నారు. మన ప్రాంతీయుడు తీసిన సినిమాను ఆదరించాలన్నారు. అలాగే నూతన నటి నటీమణులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్‌ ముత్తా కుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆల్డ్రిన్‌, కెమెరామెన్‌ వైవి.లక్ష్మీనారాయణ హీరోయిన్‌ విద్యా కృష్ణ, హీరోలు తోట కార్తీక్‌, అమన్‌ రామదుర్గ, నాగ పుల్లయ్య, కిషోర్‌ (ఆర్‌ఎంపి) తదితరులు పాల్గొన్నారు.