Nov 23,2022 23:50

పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం :ఈఎస్‌ఐ హాస్పిటల్‌ సమస్యల పరిష్కారానికి ఈ నెల25న బీసీ గెట్‌ వద్ద ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు వివి. రమణ పిలుపునిచ్చారు.బుధవారం ఉక్కు నగరంలో కాంట్రాక్ట్‌ కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ కాంటాక్ట్‌ కార్మికుల దగ్గర నుండి నెలకు కోటి రూపాయలు ఇఎస్‌ఐ బోర్డుకి చెల్లిస్తున్నారని, అయినా కార్మికులకు మెరుగైన వైద్యం అందడం లేదన్నారు. ఈఎస్‌ హాస్పిటల్‌లో సరైన ఔషదాలు లేవని, రిఫరల్‌ హాస్పిటల్‌కు బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో అక్కడ రోగుల్ని సరిగా పట్టించుకోకపోవడం లేదన్నారు. దీనిపై విజయవాడలోని ఇఎస్‌ఐ బోర్డు డైరెక్టర్లు కలిసి సమస్యలు విన్నవిస్తే, రాష్ట్ర ప్రభుత్వంవైపు చూపడం దుర్మార్గమన్నారు. తక్షణం స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంటాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాస్‌, బంధం రాము,డి.లక్ష్మి, రాము, రామ్‌ నాయుడు, శ్రీను. తదితరులు పాల్గొన్నారు
ధర్నా వాల్‌పోస్టర్‌ ఆవిష్కరణ
25న స్టీల్‌ప్లాంట్‌ బిసి గేటు వద్ద చేపట్టే ధరానకు సంబంధించి వాల్‌పోస్టర్‌ను కాంట్రాక్టు లేబర్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యాన. ఎల్‌ఎంఎంఎం పార్కు వద్ద ఆవిష్కరించారు. ఈసందర్భంగా యూనియన్‌ గౌరవ అధ్యక్షులు ఒవి రావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇఎస్‌ఐ నిర్వీర్యమౌతోందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు. నమ్మి రమణ, జి.శ్రీనివాసరావు, డి.పాండే, బి కన్నబాబు, ఆర్‌టి రాజు పాల్గొన్నారు.