ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఉండాలని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యంపై అపోహలు లేకుండా ఉండాలన్నారు. వలివేటి సత్యవాణి తృతీయ వర్ధంతి సందర్భంగా మండలంలోని వంకాయలపాడులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శిబిరాన్ని న్యాయవాది రావి సత్యనారాయణ ప్రారంభించారు. పావులూరి చెన్నకేశవాచార్యులు హాజరై మాట్లాడారు. శిబిరంలో ఈసిజి, షుగర్ పరీక్షలు చేసి చేశారు. డాక్టర్ విష్ణుప్రియ, జివివి చైతన్య, సయ్యద్ నజీబ్ ఉల్లా, శరవణ్, ఆకాష్ వైద్య సేవలందించారు. కార్య్రక్రమంలో వలివేటి రామారావు, కుక్కపల్లి బుచ్చిబాబు, వైద్య శిబ్బంది పాల్గొన్నారు.










