ప్రజాశక్తి -ఆనందపురం : మండలంలోని సోంఠ్యాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 250 మీటర్లు జాతీయ జెండాను విద్యార్థులు ఉపాధ్యాయులు తయారుచేశారు. జాతీయ జెండా గొప్పతనాన్ని వివరిస్తూ, స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా, ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు వినూత్నంగా అన్ని శాఖల అధికారులు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులతో కలిసి 250 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లెంక రాంబాబు, సర్పంచ్ లెంక లావణ్య, పెరెంట్స్ కమిటీ చైర్మన్ బొద్దపు బంగార్రాజు, ఎంపిటిసి సభ్యులు పల్లా దుర్గ, నాయకులు కోరాడ వెంకటరమణారావు, వృక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాకర సురేష్‌కుమార్, ప్రధానోపాధ్యాయులు జోగారావు, మేము సైతం వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిరెడ్డి దేవుడుబాబు, యోగా గురువు కట్టమూరు బాలభాను, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు కన్నారావు పాల్గొన్నారు.










