Sep 07,2023 22:38

ప్రజాశక్తి - పాలకొల్లు రూరల్‌ 
            అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియాన్ని అధికారులు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. మండలంలోని దిగమర్రు బైపాస్‌ రోడ్డు చెక్‌పోస్టు సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని బుధవారం పాలకొల్లు సివిల్‌సప్లై డిటి సత్యనారాయణ, మొగల్తూరు డిప్యూటీ తహశీల్దార్‌ నరేష్‌కుమార్‌ పట్టుకున్నారు. మొత్తం 250 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.3.75 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పాలకొల్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద భద్రపరిచారు. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన బియ్యం యజమని గొట్టాపు రమేష్‌బాబుపై, లారీ డ్రైవర్‌ కృష్ణపై 6ఎ కేసు నమోదు చేశామని డివిజనల్‌ సివిల్‌ సప్లై అధికారి రవిశంకర్‌ తెలిపారు. ఈ దాడులో అటెండర్లు జి.వీరభద్రపరమేశ్వరరావు, ఉంగరాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.