Oct 11,2023 23:27

ప్రజాశక్తి - వినుకొండ : బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక షెడ్డులో బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో తనిఖీలు చరేసి పట్టుకున్నారు. నిందితుడు ఈ బియ్యాన్ని చుట్టుపక్కల గ్రామాల్లోని కార్డుదారుల నుండి కిలో రూ.11 చొప్పున కొని ఎక్కువ ధరకు ఫౌల్ట్రీ ఫారాలు, హోటళ్లకు విక్రయించేందుకు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. నిందితునిపై 6ఎ కేసుతోపాటు క్రిమినల్‌ కేసుల నమోదుకూ సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ను విజిలెన్స్‌ అధికారులు ఆదేశించారు. తనిఖీల్లో విజిలెన్సు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.శ్రీనివాసులురెడ్డి, తహశీల్దార్‌ కె.నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.