పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు
ప్రజాశక్తి-మోతుగూడెం
చింతూరు సిఐ ఎం.అప్పల నాయుడు పర్యవేక్షణలో మోతుగూడెం ఎస్‌ఐ వి.సత్తి బాబు సిబ్బందితో కలిసి లక్కవరం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, 25 కేజీల గంజాయి పట్టుబడింది. అటుగా వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, ఒడిశా రాష్ట్రం కెందుగూడ గ్రామం నుండి మధ్యప్రదేశ్ భోపాల్‌కు 2 ప్లాస్టిక్ మూటల్లో ఈ గంజాయిని గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.7,50,000 ఉంటుంది. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు, డొంకరాయి గ్రామానికి చెందిన ఒకరిని అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి పరారీలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ పట్టభి రామయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్తిబాబు, కానిస్టేబుళ్లు సన్యాసిరావు, మురళికృష్ణ, శివ ప్రసాద్, ఎఆర్ సిబ్బంది పాల్గొన్నారు.










