Oct 04,2023 21:56

ప్రజాశక్తి - ఏలూరు
          జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్షలో బుధవారం 25 గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 5,972 ఓపి నమోదైందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.శర్మిష్ట తెలిపారు. వీరిలో మహిళలు 3,385 మంది కాగా 2587 మంది పురుషులున్నారు. ఆరోగ్య పరీక్షల అనంతరం 116 మందికి మెరుగైన వైద్యం కోసం ఆయా ఆసుపత్రులకు రిఫర్‌ చేశామన్నారు. వివిధ అనారోగ్య సమస్యలున్న 5972 మందికి ఉచితంగా మందులు అందించామన్నారు.
ముసునూరు:పేద, మధ్యతరగతి,ఉన్నతవర్గం అనే తేడా లేకుండా ఆందరికీ మెరుగైన వైద్యసేవలందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని సర్పంచి తల్లిబోయిన రాధిక సత్యనారాయణ, ఎంపిటిసి తోట రమాదేవిమురళీ అన్నారు. మండలంలోని చెక్కపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంపిడిఒ జి.రాణీ, ఎంపిపి రాపర్ల కృష్ణకుమారి ఆధ్యక్షతన బుధవారం నిర్వహించారు. వైద్యలు ఎం.కిరణ్‌కుమార్‌, కరీముల్లా, జి.ప్రతాప్‌ గ్రామస్తులకు వైద్యసేవలందించి, మందులిచ్చారు. ఎక్స్‌రే, ఇసిజి, ఇతర పలు సేవలను వారు పరిశీలించారు.
జీలుగుమిల్లి:జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్‌ అధ్యక్షురాలు కె.పోచమ్మ అన్నారు. బుధవారం మండలంలోని తాటియాకులగూడెం పంచాయతీలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిందని, ప్రజల వద్దకే వైద్య శిబిరాలను తీసుకెళ్తుందని, దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో భాగంగా మొత్తం పలువురికి టోకెన్‌లు ఇచ్చామని తెలిపారు. వారితో పాటు శిబిరానికి మొత్తం 263 మంది వచ్చినట్లు వారికి కూడా పలు రకాల పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ సుందర్‌ సింగ్‌, ఎఒ గంగాధర్‌, ఇఒపిఆర్‌డి మధుచరణ్‌, సర్పంచి వనమా రాంబాబు, స్పెషలిస్ట్‌ వైద్యులు నాగ దేవి, గాయత్రి, సిహెచ్‌ఒ శ్రీనివాసరాజు, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నూజివీడు రూరల్‌: మండలంలోని గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరాన్ని తహశీల్దార్‌ డివిఎస్‌.ఎల్లారావు, ఎంపిడిఒ ో విజరు బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ఈ వైద్యసేవలు పొందారు.
ముదినేపల్లి : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవలందిస్తున్నామని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని అల్లూరులో గురువారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ జగనన్న రాష్ట్రంలోని పేదలకు ఉచిత వైద్య సేవలందిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య సురక్ష ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సభ్యులు ఈడే వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంటా సంధ్య, వైస్‌ ఎంపిపి రాధా, ఎంపిడిఒ మల్లీశ్వరి, గ్రామ సర్పంచి శీలం రామకృష్ణ, ఎంపిటిసి రెడ్డి సతీష్‌, వైసిపి నాయకులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం : ఆరోగ్య సురక్షలో 1500 మంది వైద్య పరీక్షలు పొందారని మున్సిపల్‌ కమిషనర్‌ పి.భవాని ప్రసాద్‌ తెలిపారు. బుధవారం పురపాలక సంఘం హరిజన పేట అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌1, 6 సచివాలయాల పరిధి, సెయింట్‌ జాన్సన్‌ స్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చింతలపూడి ఎంఎల్‌ఎ ఉన్నమట్ల ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ ఆదర్శవంతమైన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ క్రమంలో 2218 మందికి టోకెన్‌లు ఇచ్చామన్నారు. మెట్టప్రాంతం నుండి మెరుగైన వైద్యం కోసం ఏలూరు, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందొచ్చన్నారు. సుమారు మూడువేల రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతుందని తెలిపారు. సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని తగిన వైద్యం అందించేందుకు సిఎం జగన్‌ ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బత్తిన నాగలక్ష్మి, వైస్‌ఛైర్మన్‌ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, ఎంపిపి కొదమ జ్యోతి, జెడ్‌పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జీ, స్థానిక కౌన్సిలర్లు, వైద్య ఆరోగ్య, మున్సిపల్‌ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలవరం:జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు వరంలాంటిదని ఇటుకలకోట సర్పంచి సున్నం చంద్రమ్మ, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఇటుకలకోటలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకగా చేపట్టారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.శ్రీను, మండల డిప్యూటీ తహశీల్దార్‌ ప్రసాదరావు, వైసిపి మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, వైసిపి నాయకులు, మాజీ ఎంపిటిసి సున్నం గంగాజలం, వైద్య అధికారులు, పంచాయతీ కార్యదర్శి, ఎఎన్‌ఎంలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.