డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఆహ్వానపత్రికను అందజేస్తున్న నిర్వాహకులు
వినుకొండ: మహకవి, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 52వ వర్థంతి సందర్భంగా జాషువా సాంస్కృతిక సమాఖ్య సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటల నుండి స్థానిక జాషువా కళా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి రంగ స్థల పద్య పోటీలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు మందా వెంకటావు తెలిపారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను ఆయన కార్యాలయంలో కలసి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు వెంకట్రావు తెలిపారు.










