పిడుగురాళ్ల: మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని పిడుగురాళ్ల పట్ట ణంలోని బంగ్లా సెంటర్ వద్ద మున్సిపల్ వర్కర్ల ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వర శనివారం పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు అవుతున్న పారిశుధ్య కార్మికులకు తాను వస్తే పర్మినెంట్ చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, ఇది మాట తప్పడం మడమ తిప్పడం కాదా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, స్థానికంగా కొబ్బరి నూనె,బెల్లము,చెప్పులు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం విజయవాడ కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కే సీతారామయ్య అధ్యక్ష వహించారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










