పిడుగురాళ్ల: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలు పులో భాగంగా స్థానిక బంగ్లా సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మానవహారాన్ని మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోం దని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పాద యాత్ర చేస్తూ ఇలాంటి మురికి పనులను లక్ష రూపాయలు జీతం ఇచ్చినా ఎవరూ చేయరని, తాను అధికారంలోకి వస్తే వీళ్లం దరినీ పర్మినెంట్ చేస్తానని నాడు హామీ యిచ్చి, సీఎం అయిన తర్వాత మాట తప్పా రని విమర్శించారు. అదే విధంగా ఆప్కాస్ సంస్థను తీసుకొచ్చి దానిలో చేర్చడం వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ కూడా అమలు కావట్లేదని, పెరిగిన ధర లకు అనుగుణంగా వేతనాలు లేకపోవడం వలన కార్మికుల ఆర్థికంగా ఇబ్బంది పడు తున్నారని అన్నారు. కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని తదితరు డిమాండ్ల సాధన కోసం ఈనెల 21వ తేదీన బైక్ ర్యాలీ, 24న చలో విజయ వాడ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు బత్తుల రామారావు ,అంగడి శ్రీను, బత్తుల అనిల్ ,కోటేశ్వరరావు, మార్త మ్మ, కుంభ క్రిష్ణవేణి ,అనంతలక్ష్మి, కంప శివ ,తమ్మిశెట్టి పద్మ, కొదమల మరియమ్మ, అరుణకుమారి పాల్గొన్నారు. సత్తెనపల్లి: మున్సిపల్ కార్మికులను పర్మిట్ చేయాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకులు జడ రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 24న విజయవాడకు మున్సిపల్ కార్మికులంతా తరలిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ మేరకు స్థానిక గార్లపాడు బస్టాండ్ సెంటర్లో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్క రించాలని సిఐటియు ఆధ్వర్యంలో మానవ హారం నిర్వహించారు. రాజ్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మున్సిపల్ కార్మికులపై చిన్నచూపు తగదని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ కె.షమ్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సి పల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూని యన్ అధ్యక్షులు చింతకుంట్ల పెద్ద వెం కయ్య, పల్నాడు జిల్లా అధ్యక్షులు చంద్రకళ, కార్మికులు జి కమలమ్మ,మేడి సత్యవతి ,చిలక సునీత తదితరులు పాల్గొన్నారు. దాచేపల్లి: మండలంలోని దాచేపల్లి మున్సి పాలిటీ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో దాచేపల్లి మున్సి పల్ కమిషనర్ కు సత్యనారాయణకు మున్సిపల్ కార్మికులు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయరాజు పాల్గొన్నారు.










