నిందితులతో పోలీసులు
ప్రజాశక్తి -జి.మాడుగుల:మత్స్యపురం జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు.జి.మాడుగుల నుండి పాడేరు వెళ్తున్న ఇన్నోవా కారుని తనిఖీ చేయగా 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ అందించిన వివరాలు.. గంజాయితో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకు న్నామన్నారు. వీరి వద్ద నుండి 28000 రూపాయల నగదు, ఇన్నోవా కారు, మూడు మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిం చామన్నారు.










