240 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ప్రజాశక్తి - చాగలమర్రి
మండలంలోని మద్దూరు మెట్ట సమీపంలో 40వ జాతీయ రహదారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ నాగరాజుయాదవ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 240 బస్తాల రేషన్ బియ్యంతో ఉన్న లారీని గురువారం సీజ్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా వెలుగోడు నుంచి కడప జిల్లా మైదుకూరుకు ఏపీ 21 డబ్ల్యూ 2467 నంబరు గల లారీలో దాదాపు 240 బస్తాలను తరలిస్తుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐ నాగారాజు యాదవ్, ఎస్సై హనుమంతయ్యలు మండలం లోని మద్దూరు మెట్ట సమీపంలో దాడులు నిర్వహించి, లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవరు భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని, లారీని స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. అక్రమ రవాణాకు కారణమైన నింది తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సప్లయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










