Nov 05,2023 22:38

బెల్లపు ఊటలను ధ్వంసం చేసిన ఎస్‌ఇబి అధికారులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడులు చేపట్టారు. ఒడిశా సరిహద్దు గ్రామాలైన చిన్నబుర్జోల, పెద్దబుర్జోల, దుర్గం, ఏక్మర, మారంగిలో నాటుసారా తయారీ స్థావరాలపై సంయుక్త దాడులు చేశారు. ఈ దాడుల్లో 24 వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఆ స్థావరాల్లో తయారైన 220 లీటర్ల నాటుసారాను కూడా ధ్వంసం చేశారు. దాడుల్లో ఎస్‌ఇబి ఇన్‌స్పెక్టర్‌ డి.అనిల్‌ కుమార్‌, బి.మురళీధర్‌, బి.నరసింహమూర్తి, కె.లకీëనాయుడు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వి.వేణుగోపాల్‌, జె.సంధ్యారాణి, కె.కృష్ణారావు, ఎస్‌ఇబి, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు.