Nov 07,2023 21:15

న్యూయార్క్‌ : అమెరికా కేంద్రంగా పని చేస్తోన్న గ్లోబల్‌ బ్యాంకింగ్‌ సంస్థ సిటీ గ్రూప్‌ వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనుందని రిపోర్టులు వస్తున్నాయి. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా సంస్థలోని 10 శాతం మంది (దాదాపు 24వేల ఉద్యోగులు)ను ఇంటికి పంపించనుందని సమాచారం. 2021లో సిటీ గ్రూప్‌ సిఇఒగా బాధ్యతలు స్వీకరించిన జేన్‌ ఫ్రాజర్‌ పొదుపు చర్చల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు వివిధ కన్సల్టెన్సీలో చర్చలు జరుపుతున్నారని రిపోర్టులు వస్తున్నాయి సిటీ గ్రూపులో ప్రపంచ వ్యాప్తంగా 2.40 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆ సంస్థలో ప్రస్తుతం ఉన్న 13 అంచెల వ్యవస్థను ఎనిమిది అంచెలకు కుదించే యోచనలో ఉన్నారు.