Oct 05,2023 23:02

చినవెంకన్న ఆలయ హుండీల లెక్కింపు
ప్రజాశక్తి - ద్వారకాతిరుమల

          జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి హుండీల ద్వారా రూ.1,81,71,372 ఆదాయం లభించింది. ఆలయ హుండీలను గురువారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ లెక్కించారు. 24 రోజులకు గాను జరిగిన ఈ లెక్కింపులో నగదు రూపేణా పైన పేర్కొన్న మొత్తం, బంగారం 475 గ్రాములు, వెండి 6 కేజీల 14 గ్రాములు, పాత రూ.500 నోట్లు 34, రూ.వెయ్యి నోట్లు రెండు, విదేశీ కరెన్సీ సైతం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు తెలిపారు.