పంచాయతీ
24 పంచాయతీలకు
9మందే కార్యదర్శులు..
ప్రజాశక్తి-వరికుంటపాడుమండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఎక్కువగా ఉంది. మండలంలో మొత్తం 24 పంచాయతీలు ఉండగా కేవలం 9 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దీనివలన పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంచాయతీలలో అభివద్ధి సక్రమంగా జరగాలంటే పంచాయతీ కార్యదర్శులు కీలకం. వీరి కొరత వలన అభివద్ధి సకాలంలో జరడం లేదనే అపవాద కూడా ఉంది. ముఖ్యంగా మండల కేంద్రమైన వరికుంటపాడు, జడ దేవి, తూర్పు చెన్నంపల్లి, గువ్వాడి, కాంచెరువు, నార్త్ కొండయ్య పాలెం పంచాయతీలలో నెలలు తరబడి కార్యదర్శులు లేకపోవడంతో ఇన్చార్జు ల పాలనే సాగుతూ ఉంది. ఉన్నతాధికారులు పర్మినెంట్ పంచాయతీ కార్యదర్శులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.










