
పోస్టర్ ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు
ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : విజయవాడ చెస్ అసోసియేషన్ - ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంలో ఈనెల 24వ తేదీన నగరంలోని అమ్మన ఎస్టేట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ పోటీలను నిర్వహించనున్నట్లు విజయవాడ చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శిలు డాక్టర్ ఎం.డి.అక్భర్‌భాషా,మందుల రాజీవ్ తెలిపారు. గవర్నరుపేటలోని అమ్మన ఎస్టేట్‌లో గల చెస్ అసోసియేషన్ నందు శనివారం చెస్ పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. పోటీలు అండర్ -6, అండర్ -8, అండర్ -10, అండర్ -12, అండర్ -14, అండర్ -16 విభాగాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుండి సుమారు 200 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు.