పిడుగురాళ్ళ: పట్టణంలోని పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి రమ్య హారిక అరుదైన రికార్డ్‌ను సొంతం చేసు కున్నారు. కేవలం 24 గంటల్లో 21 మంది గర్భిణులకు పల్నాడు హాస్పిటల్స్‌లో కాన్పులు చేశారు. కీళ్ళ మార్పిడీలో గోల్డ్ మెడల్ సాధిం చిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సతీమణి డాక్టర్ రమ్య హారిక ప్రసూతి సంతాన సాఫల్య వైద్యంలో గోల్డ్ మెడలిస్టు. పల్నాడు ప్రాంత చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఒకే రోజులో 21 మంది గర్భిణులకు సిబ్బంది సహాయంతో కాన్పులు చేయడంతో ఆమెను పలువురు అభినందించారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 21 కాన్పులు చేయగా అందులో 11 మంది మగ శిశువులు, 10 మంది ఆడ శిశువులు జన్మించారని, తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. తల్లులు, పిల్లలు క్షేమంగా వున్నారని వెల్లడించారు. పల్నాడు హాస్పిటల్స్‌లో ప్రసవిం చిన మాతృమూర్తులకు అమ్మకోసం పథకం వర్తించేలా చేస్తున్నామన్నారు. కాన్పు అయిన వారికి ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ అందించడం జరిగిందని అశోక్ కుమార్ రమ్య హారిక దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పల్నాడు ఒయాసిస్ ఆస్పటల్‌లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ సందీప్, మత్తు వైద్యులు వెంకట్, ఓ.టి స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.










