Jul 11,2023 00:07

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)ఃలో 24 గంటలు పనిచేసే మరో మందుల కౌంటర్‌ను ఔషద శాస్త్ర విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ కె.శంకర్‌ సోమవారం ప్రారంభించారు. అత్యవసర విభాగం సమీపంలో ఈ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అత్యవసరం విభాగం నుంచి పాత ఆసుపత్రి భవనంలో ఉన్న 13వ మందుల కౌంటర్‌కు వెళ్లి మందులు తీసుకోవడం కష్టంగా మారిందని, రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారని, అందుకే ఇక్కడ ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ చెప్పారు.