
ముంబై : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ... నేడు 23వ మ్యాచ్ ముంబైలోని వాంఖడే వేదికగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బరిలోకి రెండు జట్లు దిగనున్నాయి. ఈ ప్రపంచకప్ ఆటలో దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్‌లు గెలుపొందగా, బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇదిలా ఉంటే బంగ్లా కెప్టెన్ షకీబ్ తిరిగి జట్టులోకి రానున్నారు. అటు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా కూడా తిరిగి టీమ్ లో చేరనున్నారు. ముందుగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాదే పైచేయి అని మ్యాచ్ ప్రిడిక్షన్ మీటర్ చెబుతోంది.
సౌతాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్ : టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్‌సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, లుంగ్.
బంగ్లాదేశ్ ప్లేయింగ్ ఎలెవన్ : తంజీద్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), తౌహీద్ హఅదరు, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫ్.