
టెలీకాన్సరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు
* కిడ్నీ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం ప్రారంభం అ మంత్రి అప్పలరాజు వెల్లడి
ప్రజాశక్తి- పలాస: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 23న జిల్లాకు రానున్నారని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. పలాసలో నిర్మిస్తున్న కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, పరిశోధక కేంద్రాన్ని ఆ రోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఈ మేరకు సోమవారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయమయ్యేందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు. పలాసలో ఈ నెల 5న నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమయ్యిందని తెలిపారు. కార్యకర్తల్లో మంచి జోష్ ఉందని, ఎన్నికల వరకు కొనసాగించాలని కోరారు.