న్యూఢిల్లీ : ఈ నెల 23న భారత్‌లో ఒప్పో కే10 5జీ సిరీస్‌ను ఒప్పో ఇండియా లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. కే9 ఫోన్లకు కొనసాగింపుగా కే10 5జీని ఒప్పో లాంఛ్ చేస్తోంది. చైనాలో కే సిరీస్‌కు ఆదరణ లభించగా కే 10 5జీ భారత్, చైనా మార్కెట్లలో ఒకేసారి లాంఛ్ కానుందని సమాచారం.
ఇక చైనాలో ఇప్పటికే కే9 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఒప్పో ఇండియా ట్విటర్‌లో కే 10 లాంఛ్‌పై సంకేతాలు పంపింది. మరోవైపు ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్‌కార్ట్ ఒప్పో కే10 కోసం ప్రత్యేకమైన పేజ్‌ను ఏర్పాటు చేసింది.
ఒప్పో కే10 ఫీచర్లు ఇంకా వెల్లడికానప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.20,000లోపు లభిస్తుందని 91 మొబైల్స్ వెల్లడించింది. 5జీ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో అందుబాటు ధరలో 5కే 10 లభించనుంది. ఒప్పో కే10 భారత్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8000 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంటుంది.










