Dec 20,2022 23:13

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: ఈ నెల 23, 24,25 తేదీలలో నగరంలోని శేషసాయి కళ్యాణమండపంలో నరెడ్కో (నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ) 9వ ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు నరెడ్కో విజయవాడ ఛాప్టర్‌ అధ్యక్షులు అమరనాథ్‌ తెలిపారు. ఎల్‌ఐసి కాలనీలోని నరెడ్కో కార్యాలయంలో ప్రాపర్టీ షోకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అమరనాథ్‌ మాట్లాడుతూ సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. లోన్‌ సదుపాయం, నిర్మాణ సామాగ్రి సరఫరాదారులు ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర మునిసిపల్‌ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తారపన్నారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో సభ్యులు రత్నకుమార్‌ పలువురు పాల్గొన్నారు.