ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: వివాహ ఫ్యాషన్ అవసరాలను తీర్చేందకుగాను ఈ నెల 23వ తేదీ నుండి నగరంలోని హౌటల్ నోవాటెల్ నందు హై లైఫ్ బ్రైడ్స్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహఖులు పి.డొమినిక్ తెలిపారు. బుధవారం ఉదయం రింగురోడ్డు వద్ద గల హౌటల్ నోవాటెల్ నందు ఎగ్జిబిషన్ సందర్భంగా మోడల్స్‌తో ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వివాహాల సందర్భంగా ఎక్కువ మంది వివాహ వస్త్రాకలు సంబంధించి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థిత ఉంటుందన్నారు. అయితే వివాహ వస్త్రాలన్ని ఒకేచోట అందించాలనే ఉద్దేశంలో హై లైఫ్ బ్రైడ్స్ ప్రదర్శన ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు నగరంలోని హౌటల్ నోవాటెల్ నందు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈప్రదర్శనలో వెడ్డింగ్ ఫ్యాషన్స్, జ్యువెలరీ, బ్రైడల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులతో పాటు డిజైనర్స్, చీరలు, ప్రముఖ ఫ్యాషన్ వస్త్రాల వారు స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తారన్నారు. రెండు రోజల పాటు జరిగే ఈప్రదర్శనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రదర్శనలో ప్రముఖ నటి కామాక్షి భాస్కర్ల, టాప్ మోడల్స్ పాల్గొన్నారు.










