May 22,2023 00:14

పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక

నాటి తీపి గుర్తులను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు
             ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ :
వెల్దుర్తి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1999-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆ పాఠశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. 23 ఏళ్ల తర్వాత అపూర్వ కలయికతో పాటు, ఆనాటి గురువులను సాదరంగా గౌరవిస్తూ అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. ఈ కలయిక వారికి అత్యంత ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపింది. గురువులు విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న పలు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒకే పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు 23 ఏళ్ల తర్వాత కలుసుకుని వివిధ రంగాలలో స్థిరపడిన వారి అనుభవాలను పంచుకున్నారు. నాడు విద్యను బోధించిన ఉపాధ్యాయులు శేషఫణి శర్మ, రఘురామిరెడ్డి, మహమ్మద్‌ రఫీక్‌, రేవతి, పద్మశ్రీ, ఫాతిమా, ఎలిజబెత్‌, సంధ్యారాణిలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్న అనుబంధం అత్యంత పవిత్రమైందని అన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికీ విద్యార్థుల బాగోగులని కాంక్షిస్తారని తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి ఉన్నత దశకు చేరుకున్నప్పుడే అత్యంత ఆనందాన్ని పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మునిస్వామి, పావని పాడిన గేయాలతో పాటు రమేష్‌, పూర్వ విద్యార్థుల పిల్లలు ఆడిన సినీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనివాసులు, శ్రీరామచంద్రుడు, లాజర్‌, మధు, రామ్‌ మధు, శరత్‌ బాబు, హరి, పెద్దిగారి లక్ష్మన్న, భీమేష్‌, మునిస్వామి, హుసేని, మధు శేఖర్‌, వెంకటేశ్వర్లు, నాగమద్దయ్య, శ్రీనివాసులు, మౌలాలి, భారతి, మాధవి, యశోద, చెన్నమ్మ లావణ్య, లావణ్య, ఫాతిమా, రేణుక, తదితరులు పాల్గొన్నారు.
           ఇటీవల మృతిచెందిన పూర్వవిద్యార్థి నాగరాజు కుటుంబానికి రూ.25 వేలు విరాళం ఇచ్చారు.