Jun 02,2023 19:24

పోటీలను ప్రారంభిస్తున్న తిమ్మారెడ్డి వారసులు

ప్రజాశక్తి - హోళగుంద
ఇంగలదహల్‌ గ్రామంలో గ్రామ అధిపతి, గ్రామ సేవకుడిగా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి కీర్తిశేషులు కెసి.తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం టెన్నిస్‌బాల్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ను తిమ్మారెడ్డి వారసులు ప్రారంభించారు. శుక్రవారం తిమ్మారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మ్యాచ్‌ను ప్రారంభించారు. తిమ్మారెడ్డి వారసులు కార్తీక్‌ రెడ్డి, సందీప్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి కెంచప్ప, ఎంపిటిసి మల్లికార్జున మాట్లాడుతూ... గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అలాగే ఈ పోటీల్లో గెలుపోటములను అందరూ సమానంగా స్వీకరించాలని చెప్పారు. ఎలాంటి గొడవలూ లేకుండా ఐకమత్యంతో ఆడాలని కోరారు. మొదటి మ్యాచ్‌లో పెద్దహరివాణం, ఎమ్‌డి.హళ్లి జట్లు తలపడ్డాయి. ఇందులో ఎమ్‌డి.హళ్లి జట్టు 71 పరుగులు చేయగా పెద్దహరివాణం జట్టు 72 పరుగులు చేసి విజయాన్ని నమోదు చేసింది. పెద్దహరివాణం జట్టు సభ్యులు వెంకటేష్‌ 4 వికెట్లు తీసి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అందుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అభినరు రెడ్డి, వినరు రెడ్డి, హర్ష రెడ్డి, ఆర్గనైజర్లు ఎంపిటిసి మల్లికార్జున, తిమ్మప్ప, మాస, వీరేష్‌, రాజు, గ్రామ పెద్దలు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.