ప్రజాశక్తి-ఉక్కునగరం : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్‌ల కింద మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 22న జివిఎంసి కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టే నిరసన పాదయాత్రను జయప్రదంచేయాలని అఖిలపక్ష కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ జంక్షన్‌లో అఖిలపక్ష కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు పిట్టా రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా మార్చి, హక్కులను కాలరాసి కార్మికులను యజమానులకు బానిసలు చెయ్యాలని చూస్తోందని విమర్శించారు. 23వ తేదీన స్టీల్‌ప్లాంట్ బిసి గేటు వద్ద తలపెట్టిన ధర్నాను జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, బి.కన్నబాబు, డి.పాండే, బైరెడ్డి అప్పలరెడ్డి, ఒనుం అప్పలరాజు, ఎ.శ్రీను, డిఎస్‌వి నరసింగరావు, చట్టి నరసింగరావు, గొడ్డి రమణ, కోన రమణ తదితరులు పాల్గొన్నారు.










