Oct 19,2022 22:42

జాబ్‌మేళా

ప్రజాశక్తి -కంచరపాలెం : పలు కంపెనీలలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 22 శనివారం కంచరపాలెం జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి( టెక్నికల్‌) కె. సుధా ఒక ప్రకటనలో తెలిపారు. టాటా టెక్నాలజీస్‌, ప్లాటినం మోటార్స్‌, ఎడిఇసిసిఒ విశాఖపట్నం, గుడ్‌ వర్కర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పేటిఎం విశాఖపట్నం నాలుగు సంస్థల్లో మొత్తం 1980 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. టెన్త్‌ ఇంటర్‌, ఏదైనా డిగ్రీ, డిప్లమో, లేదా ఆ పై విద్యార్హత కలిగిన 18-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులన్నారు..సంస్థ, ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి నెలకు రూ.9,500 నుంచి రూ.17వేలు వరకు వేతనం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, ఇన్సెంటివ్స్‌ ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా తమ వివరాలను అషర.స్త్రశీఙ.ఱఅలో నమోదు చేసుకోవాలని, బయోడేటా, ఇతర అర్హత ధ్రువీకరణలతో జాబ్‌మేళాకు హాజరు కావాలని సూచించారు.