మాజీమంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్
ప్రజాశక్తి-పెందుర్తి/ సింహాచలం : సింహాచల దేవస్థానం పంచ గ్రామాల పరిధిలోని '22ఎ' జాబితాలో చేర్చిన భూములన్నింటికీ ఒకే విధంగా న్యాయం చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. వేపగుంట సర్వేనెంబర్ 30 లో 42 ఎకరాల భూమిని మాత్రమే '22ఎ' నుంచి తొలగించి, బడాబాబులకు దారాధత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. సర్వే నెంబర్ 30లో 42 ఎకరాలు భూమిని '22ఎ' నుంచి ఏ విధంగా తొలగించారో, అదేవిధంగా వేపగుంట పురుషోత్తపురం, అడివివరం, చీమలాపల్లి, వెంకటాపురంలో ఉన్న ఇనాం జీరాయితీ భూములను 22ఏ నుండి తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. 22ఏలో ఉన్న రైతు హక్కుదారులను గుర్తించి, అందరికీ ఒకేలా న్యాయం చేయాలని కోరారు. సిసిఎల్ ద్వారా 42 ఎకరాలను 22ఏ నుంచి తొలగించినప్పుడు, మిగిలిన భూములకు అది ఎందుకు సాధ్యకాదని ప్రశ్నించారుపంచగ్రామాల రైతులందరికీ న్యాయం చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ కార్పొరేటర్ లు పీవీ నరసింహం 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు










