Aug 17,2023 17:48

ప్రజాశక్తి - భీమడోలు
            స్వచ్ఛంద సంస్థ మానవత ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జిల్లాస్థాయిలో ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీన గణపవరంలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు, సమన్వయకర్త రామిశెట్టి గంగాధరరావు తెలిపారు. ఈ కార్యక్రమం లో భాగంగా భీమడోలులోని వివిధ ప్రభుత్వ, ప్రయివేట్‌ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకులు డాక్టర్‌ సునీత ,మత్తు వైద్య నిపుణులు డాక్టర్‌ అశ్విని తోపాటు భీమడోలు మండలానికి చెందిన సంస్ద సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్ద జిల్లా మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ మానవత సంస్థ ఆవిర్భావం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగు తాయన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా వివిధ మానవత శాఖల ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టనున్నా మన్నారు. భీమడోలు మండలంలో నిర్వహించే కార్యక్ర మాల్లో భాగంగా 19వ తేదీన భీమడోలులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచి సునీత మాన్సింగ్‌ ఆధ్వర్యంలో చేపడతామన్నారు. ఈ నెల 21వ తేదీన పూళ్ల గ్రామంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం వంతెన వద్ద మానవV äరాన్ని ఏర్పాటుచేసి సంస్థకు సంఘీభావాన్ని తెలియ జేస్తారన్నారు. కార్యక్రమానికి భీమడోలు సిఐ వెంకటేశ్వర రావు ముఖ్యఅతిథిగా పాల్గొంటారని వివరిం చారు. 22వ తేదీన గణపవరంలో నిర్వహించే వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా పరిధిలోని 31 మండలాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులు చింతా శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.