ప్రజాశక్తి-అనకాపల్లి
ఈ నెల 22 23 తేదీల్లో జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లాస్థాయి సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్‌కు చైర్మన్‌గా కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి వ్యవహరించనున్నారని తెలిపారు. మండల స్థాయిలో ప్రదర్శించి అక్కడ జిల్లాకు ఎంపికైన పరిశోధనలు ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికైన ఉత్తమ ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ స్థాయిలోని అన్ని స్థాయిల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసి ఈ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ఉపవిద్యా శాఖ అధికారి ప్రేమ కుమార్, విద్యాశాఖ సహాయ సంచాలకులు ఆడారి రవి బాబు, ఎంఈఓ డి.దివాకర్, ఏఎమ్‌ఓ వెంకటేశ్వరరావు, కొణతాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.










