Nov 16,2023 21:04

జేసీ బాలాజీతో కలిసి సిఎం సభాస్థలిని పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం

21న సీఎం జగన్‌ సూళ్లూరుపేటకు రాక
ప్రజాశక్తి - తడ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఈనెల 21న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేకే బాలాజీ, అధికార యంత్రాంగం, సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీమంత్‌ రెడ్డి, పోలీస్‌ యంత్రాంగం గురువారం సిఎం సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించేందుకు పర్యటించారు. సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ స్థలం, ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం, అపాచీ ప్రాంగణం పక్కన ఉన్న స్థలం, టాటా స్టీల్‌ ప్రాంగణం ఎదురుగా ఉన్న స్థలాలను పరిశీలించారు. సీఎం సభా ప్రాంగణం ఎక్కడ నిర్వహించాలి అనేది త్వరితగతిన తెలియజేస్తామని జెసి బాలాజీ తెలిపారు. అనంతరం జేసి బాలాజీ అధికారులతో కలిసి సూళ్లూరుపేట లోని ప్రభుత్వ కళాశాల నందు సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులకు జేసీ సూచించారు.
జేసీ బాలాజీతో కలిసి సిఎం సభాస్థలిని పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం