Dec 18,2022 23:47

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపిపి సత్యనారాయణ

ప్రజాశక్తి-మాకవరపాలెం:ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా ఏర్పాటు చేసే రక్తదాన శిబిరం పోస్టర్‌ను ఎంపీపీ సత్యనారాయణ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 21న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. శిబిరానికి భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వాసు, వైస్‌ ఎంపీపీలు లక్ష్మీ రాజారావు, సీనియర్‌ నాయకులు పెట్ల భద్రాచలం, మూకల బాలకృష్ణ పాల్గొన్నారు.