ప్రజాశక్తి-పాడేరు: గిరిజన నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం ఐటిడిఎ సమావేశ మందిరం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంపచోడవం డివిజన్ లోని మారేడుమిల్లి యూత్ శిక్షణా కేంద్రంలో ఈనెల 21 వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తు న్నామన్నారు. పదవ తరగతి, డిగ్రీ, ఇంజనీరింగ్ డిప్లొమో విద్యార్ధులు హాజరు కావచ్చన్నారు. వరుణ్ మోటార్సు, అమర్ రాజ బ్యాటరీస్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి 16 సంస్థలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయ చెప్పారు. డిఆర్‌ఓ బి.దయానిధి, ఐటిడిఏ ఎపిఒ (జనరల్) విఎస్ ప్రభాకరరావు, ఎపిఎస్‌ఎస్ డిసి, డిఎస్ డిఒ రోహిణి, కో ఆర్డినేటర్ పవన్ పాల్గొన్నారు.










