
ప్రజాశక్తి - పోడూరు
మండలంలో అన్ని గ్రామాల్లో ఓటర్ల పరిశీలన కార్యక్రమం ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోపు కచ్ఛితంగా పూర్తి చేయాలని తహశీల్దార్ కష్ణారావు కోరారు. పోడూరులో ఇంటింటా జరుగుతున్న ఓటరు పరిశీలనా కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త ఓటర్ల నమోదు, చిరునామాల మార్పు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపులో ఎక్కడా తప్పులు దొర్లకూడదని సూచించారు. అలాగే బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక రికార్డు నిర్వహించాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎక్కడా వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి శీలబోయిన జయరామ కృష్ణ, విఆర్‌ఒలు, బిఎల్‌ఒలు పాల్గొన్నారు