
ప్రజాశక్తి - కారంచేడు
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి సీనియర్ నాయకులు, పర్చూరు ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో దీక్షలు గురువారంతో 20వ రోజుకి చేరాయి. సైకో పాలన పోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కంభంపాటి నరేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, ఫరీద్, పాతూరు శివరాం, బోయిన శీను, విలేకరు శీను, తాళ్లూరి అనిల్ కుమార్, మస్తాన్, టిడిపి మహిళా అభిమానులు పాల్గొన్నారు.