ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదంచేయాలని కోరుతూ స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) నాయకులు ఎల్‌ఎంఎంఎం కేంటీన్ వద్ద బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షులు ఒవి.రావు మాట్లాడుతూ, మార్కెట్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు మాత్రం పెరగడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు స్పందించాలంటే పోరాటమే మార్గమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, బి.కన్నబాబు, చట్టి నర్సింగరావు, యు.సోమేష్, పి.మసేను, నమ్మి చంద్రరావు, ఆంజనేయులు, కె.మల్లేశ్వరరావు, సిహెచ్.రాముడు, ఎస్.పైడిరాజు, అంకంరెడ్డి శ్రీను పాల్గొన్నారు.










