Mar 16,2023 23:49

సమావేశంలో పాల్గొన్న మిడ్డేమీల్స్‌ కార్మికులు

ప్రజాశక్తి-చోడవరం
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎపి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మెయిన్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మికులందరూ చలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్‌.బుచ్చిరాజమ్మ, జి.లక్ష్మి, బి.చింతల్లి, ఏ,ఈశ్వరమ్మ, జి,రామలక్ష్మి, నారాయణమ్మ పాల్గొన్నారు.