Mar 17,2023 23:31

మాట్లాడుతున్న ప్రసన్న

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:ఈనెల 20న జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రావాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు కే.ప్రసన్న పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారంకు ఈ నెల 20న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు.రాష్ట్రంలో అనేక ఏళ్ళుగా పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు కనీసవేతనాలు, పీఎఫ్‌, ఇఎస్సై, ప్రమాద బీమా వంటి పథకాలు ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. యూప్‌లో అప్లోడ్‌ చేయపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మెనూ చార్జీలు సమయానుకూలంగా జమ చేయ లేదని తెలిపారు. 2022డిసెంబర్‌ నెల బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారంకు ఛలో విజయవాడను చేపడుతున్నామన్నారు. సమావేశంలో సంఘం నాయకురాలు జగది పాల్గొన్నారు.